విశాఖకు భాజపా చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆ పార్టీ ముఖ్యనేతలు పుస్తకాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ శాసన సభపక్ష నేత విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. విశాఖలో రూ. 20,928 కోట్లతో హెచ్పీసీఎల్ రిఫైనరీని అభివృద్ధి చేశామని పుస్తకంలో పేర్కొన్నారు. రూ. 500 కోట్లతో 350 పడకల ఆస్పత్రి, విశాఖ - చెన్నై పారిశ్రామిక వాడ ఏర్పాటు, సింహాచలంలో 53 కోట్ల రూపాయలతో అభివృద్ధి, రైల్వే అభివృద్ధికి 175 కోట్లు కేటాయింపులు చేసినట్లు ప్రస్తావించారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి స్థానాలు లేకపోయినా విశాఖను అభివృద్ధి చేయాలనే యోచనలో కేంద్రం ప్రభుత్వం ఉందని నేతలు అన్నారు.
విశాఖ అభివృద్ధిపై పుస్తకం రూపొందించిన భాజపా - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు వార్తలు
విశాఖకు భాజపా చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆ పార్టీ ముఖ్య నేతలు పుస్తకాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి స్థానాలు లేకపోయినా విశాఖను అభివృద్ధి చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని నేతలు అన్నారు.
vizag development