విశాఖ జిల్లా పాడేరులోని గిరిజనులు భూమి హక్కులపై ధర్నా చేపట్టారు. రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షుడు అప్పలనాయుడు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. మొత్తం రాష్ట్రంలో, పాడేరు మన్యంతో కలిపి 15 లక్షల ఎకారాల భూములను గిరిపుత్రులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం లక్ష ఎకరాలనే పంపిణీ చేశారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పోడు భూములు, అటవీ భూములు, బాక్సైట్ భూములపై హక్కు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఫిబ్రవరి 23 న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలన చేపట్టాలని , వారికి తగు న్యాయం చేయాలని అన్నారు.
భూహక్కుల కోసం గిరిపుత్రుల ఆందోళన.. - darna in paderu
భూహక్కులు కల్పించాలంటూ విశాఖ మన్యం కేంద్రంగా గిరిపుత్రులు ధర్నా చేపట్టారు. అక్కడ ఉన్న పోడు భూములు, అటవీ భూములు, బాక్సైట్ భూములపై హక్కు కల్పించాలంటూ ర్యాలీ తీశారు.
dharna