విశాఖ సింహాచలం అప్పన్న ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన ఆళ్ల భాగ్యలక్ష్మి.. ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈఓ సూర్యకళ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో సభ్యురాలిగా ఉన్న దాడిదేవి స్థానంలో భాగ్యలక్ష్మిని ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ ఎండోమెంట్ - రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి జి.వాణిమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆళ్ల భాగ్యలక్ష్మి తెలిపారు.
శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా భాగ్యలక్ష్మి ప్రమాణం - శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా ఆళ్ల భాగ్యలక్ష్మి
విశాఖ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా ఆళ్ల భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో సభ్యురాలిగా ఉన్న దాడిదేవి స్థానంలో భాగ్యలక్ష్మిని ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ ఎండోమెంట్ - రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి జి.వాణిమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
![శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా భాగ్యలక్ష్మి ప్రమాణం vishaka simhachalam temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-ap-vsp-70-10-trustboardavedan-ap10145-10052021181921-1005f-1620650961-123.jpg)
vishaka simhachalam temple