విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో కాలువలు, రహదారుల నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. వీటిని సుమారు రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక గురుకుల బాలికల విద్యాలయం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఆయన.. అక్కడి వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాలయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సిబ్బందికి సూచించారు.
రూ.75 లక్షల పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన - minister srinivasarao laid inauguration on roads in visakha
విశాఖ జిల్లా భీమునిపట్నంలో రూ.75 లక్షల విలువైన పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రి, గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
రూ.75 లక్షల పనులకు మంత్రి అవంతి శంకుస్థాపనలు