ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ganja Smuggling through Amazon From visaka : 'అమెజాన్'​లో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురి అరెస్టు

అమెజాన్​ సర్వీస్ ద్వారా గంజాయి విక్రయించిన కేసులో (Ganja Smuggling gang arrested) విశాఖలో ఐదుగురిని, మధ్యప్రదేశ్​లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్​ఈబీ అధికారులు వెల్లడించారు. ఈ కామర్స్ వెబ్​సైట్ అమెజాన్​ ద్వారా హెర్బల్ ఉత్పత్తులు, కరివేపాకు పేరిట విశాఖ నుంచి మధ్యప్రదేశ్​తోపాటు ఇతర ప్రాంతాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

'అమెజాన్'​ ద్వారా గంజాయి స్మగ్లింగ్
'అమెజాన్'​ ద్వారా గంజాయి స్మగ్లింగ్

By

Published : Nov 27, 2021, 3:50 PM IST

Updated : Nov 27, 2021, 4:09 PM IST

హెర్బల్ ఉత్పత్తుల పేరిట అమెజాన్​లో గంజాయి విక్రయించిన కేసులో (Ganja Smuggling through Amazon From visaka) విశాఖలో ఐదుగురిని, మధ్యప్రదేశ్​లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్​ఈబీ అధికారులు వెల్లడించారు. ఎస్​ఈబీ జేడీ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ కామర్స్ వెబ్​సైట్ అమెజాన్​ ద్వారా హెర్బల్ ఉత్పత్తులు, కరివేపాకు పేరిట విశాఖ నుంచి మధ్యప్రదేశ్​తోపాటు ఇతర ప్రాంతాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 600 కేజీల గంజాయి అక్రమంగా రవాణా జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

'అమెజాన్'​ ద్వారా గంజాయి స్మగ్లింగ్

ఈ కేసులో ఇద్దరు అమెజాన్ డెలివరీ బాయ్స్ పాత్ర ఉందని వెల్లడించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసి, నిందితులు చిలకపాటి శ్రీనివాసరావు, జీరు కృష్ణమూర్తి, బిజ్జం కృష్ణంరాజు, చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి మోహన్ రాజును అరెస్ట్ చేసినట్టు ఎస్​ఈబీ జేడీ వెల్లడించారు. వీరి నుంచి 48 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్, గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు, బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సూరజ్, ముకుల్ జైస్వాల్​లను మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో అరెస్ట్ చేసినట్లు సతీశ్ కుమార్ స్పష్టం చేశారు.

గంజాయి రవాణా చేస్తున్న వాహనం బోల్తా..
విశాఖ (Ganja Smuggling From Amazon news) జిల్లా పెదగరువు వంతెన వద్ద గంజాయి రవాణా చేస్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. గంజా మూటలు బయటపడటంతో వాహన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి

'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

Last Updated : Nov 27, 2021, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details