ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో ఉత్పత్తి అవుతున్న కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పరిశీలించారు. వైరస్ పరీక్షల కోసం పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో ఈ కిట్లను తయారు చేశారు. ప్రస్తుతానికి వెయ్యి కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. 50 నిమిషాల్లో కరోనా పరీక్ష చేసి ఫలితం తెలుసుకునే సామర్థ్యం ఈ కిట్లకు ఉందనిపరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఒక కిట్‌తో రోజుకు 20 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉందని వివరించారు. వారంలోగా 10 వేల టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.విశాఖ మెడ్‌టెక్ జోన్ లో ఉత్పత్తి అయిన ఈ కరోనా టెస్టింగ్ కిట్ ఎలా పని చేస్తుందన్నది ఆయన వివరించారు.
మెడ్‌టెక్ జోన్ నుంచి కరోనా టెస్టింగ్ కిట్లు ... 50 నిమిషాల్లో ఫలితం - latest news on corona rapid testing kit
ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో ఉత్పత్తి అవుతున్న కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి బ్యాచ్‌లో మొత్తం 1000 కిట్లను విడుదల చేశారు. దశలవారీగా కిట్లను ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతున్నట్టు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. వచ్చే నెలలోగా 7.5 లక్షల కిట్ల ఉత్పత్తి స్థాయికి చేరుకోనున్నట్టు వెల్లడించారు.
మెడ్‌టెక్ జోన్ నుంచి కరోనా టెస్టింగ్ కిట్లు