విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించి... ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. అధికారులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారన్న ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది... వాటిని తిరిగి తమకే ఇచ్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. రోజువారీ కార్యకలాపాలకు కంపెనీలోకి సిబ్బందిని అనుమతించాలని కోరారు. సంస్థ అభ్యర్థనలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎల్జీ ప్రమాదంపై హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వండి: హైకోర్టు - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం వార్తలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించి.. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఎల్జీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఎల్జీ ప్రమాదంపై హైపవర్ కమిటీ నివేదికను ఇవ్వండి: హైకోర్టు
TAGGED:
lg polymers case news