Beach Road Corridor Corporation: విశాఖ బీచ్‌రోడ్ కారిడార్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ - విశాఖ బీచ్‌రోడ్ కారిడార్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ
17:29 June 21
విశాఖ బీచ్‌రోడ్ కారిడార్ కార్పొరేషన్
విశాఖలో బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ (Beach Road Corridor Corporation) పేరిట రాష్ట్ర ప్రభుత్వం (ap govt) ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల శాఖ నేతృత్వంలో పర్యాటకశాఖ, వీఎంఆర్డీఏ (VMRDA) తదితర విభాగాలు సంయుక్తంగా ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. విశాఖ నుంచి భీమిలి - భోగాపురం వరకూ తీర ప్రాంతాన్ని వేర్వేరు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పర్యాటక, వాణిజ్య, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను విశాఖ బీచ్ రోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 570 ఎకరాల్లో రూ. 1021 కోట్ల వ్యయంతో విశాఖ బీచ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. బీచ్ రోడ్లో రిసార్టులు, గోల్ఫ్ కోర్స్‌లు, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్ షిప్ రెస్టారెంట్ తదితర ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు.
ఇదీచదవండి: వ్యాక్సిన్లు ఉంటే.. ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారు: సీఎం