ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ నిర్ణయం.. రెండు జిల్లాలకు వరం: విజయసాయి - ఎంపీ విజయసాయి రెడ్డి తాజా వార్తలు

ఏలేరు కాలువ నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరమని తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ట్వీట్ చేశారు.

mp vijaya sai reddy
mp vijaya sai reddy

By

Published : Dec 13, 2020, 10:50 PM IST

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రభుత్వం మరో వరం ఇస్తోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. తాండవ జలాశయానికి ఏలేరు కాలువ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరమని తెలిపారు. 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతుందని ట్విట్టర్​లో తెలిపారు.

అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడుతోందని.. 700 కోట్లతో ఉద్దానంలోని ఏడు మండలాలకు నీరందించే పథకం చేపట్టనున్నట్లు తెలిపారు. హిర మండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానంకు మంచి నీరు వస్తుందని... 8 లక్షల మంది వెనుకబడిన ప్రజలకు ఇదో సంజీవని అని చెెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details