ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రేన్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన - compensation in shipyard accident

విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో శనివారం జరిగిన క్రేన్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ఒప్పంద కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు పద్దతిలో నిరంతర ఉపాధి..శాశ్వత ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు

vizag shipyard
vizag shipyard

By

Published : Aug 2, 2020, 3:41 PM IST

హెచ్​ఎస్​ఎల్ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్​(హెచ్​ఎస్​ఎల్)‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 50లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి అవంతి శ్రీనివాస్... పరిహారంపై హెచ్​ఎస్​ఎల్​ అధికారులు, కార్మికులతో చర్చించారు. శాశ్వత ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఒప్పంద కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో నిరంతర ఉపాధిని కల్పిస్తామని చెప్పారు. హెచ్ఎస్ఎల్ ద్వారా వచ్చే ప్రయోజనాలు అదనంగా ఉంటాయని అవంతి వెల్లడించారు.

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ జెట్టీ క్రేన్‌ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ శాశ్వత‌ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారు.

ABOUT THE AUTHOR

...view details