ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేతలు పట్టించుకోలేదు... వారే నిర్మించుకున్నారు!

దశాబ్ధలుగా తమ గ్రామాల రాకపోకలను సుగుమం చేసే వంతెన నిర్మించాలంటూ పదే పదే అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నారు. తమ గోడు ఎవ్వరు పట్టించుకోవడం లేదని తామే తాత్కలిక వంతెన నిర్మాణానికి నడుం బిగించారు. చివరికి ఏవోబీ పరిధిలో ప్రతికూలతలను అధిగమించి స్వయంకృషితో వంతెన నిర్మించుకున్న ప్రశంసలు కురిపిస్తోంది.

నేతలు పట్టించుకోలేదు... వారే నిర్మించుకున్నారు!

By

Published : May 8, 2019, 10:20 PM IST

నేతలు పట్టించుకోలేదు... వారే నిర్మించుకున్నారు!

కోల్లాబ్‌ జలాశయం వల్ల ఒడిశా కోరాపుట్టు జిల్లాలోని లంజిగుడ ముంపు గ్రామంగా మిగిలింది. గ్రామస్థులు సమీప సునాబెడాకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ డిమాండ్లను పక్కన పెడుతూ వస్తున్నారు.

ఎన్ని సార్లు చెప్పినా..!

నేతల తీరుతో సహనాన్ని కోల్పోయిన ప్రజలు ఇక ఎవరో వస్తారని ఎదో చేస్తారనుకోవటం పోరపాటని గ్రహించి... లంజిగుడ సమీప గ్రామాల వారంత కలసి వెదురులతో తాత్కలిక వంతెన నిర్మించుకున్నారు. వారధి నిర్మాణం వల్ల సుమారు 20 గ్రామాలకు రాకపోకలు సుగుమం కానున్నాయి. ఇప్పుడు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సునాబెడకు ఒక కిలోమీటరు దూరంతో చేరుకోగలమని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details