ఓ భుజానికి వ్యాక్సిన్ డబ్బా, మరో వైపు చేతి సంచి తగిలించుకొన్న ఓ ఏఎన్‌ఎం.. నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తున్న వాగును దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. కఠిన పరిస్థితుల్లోనూ విధులపై ఆమె చూపిన అంకితభావం, చేసిన సాహసం తెలుసుకున్న స్థానికులు అభినందనలు తెలిపారు. విశాఖ మన్యంలోని మూలపేట పంచాయతీ పొర్లుబంద చేరుకోవాలంటే పెద్ద కొండవాగు దాటాలి. డౌనూరు పీహెచ్‌సీ ఏఎన్‌ఎం ఎన్.సత్యవతి శనివారం తాడు సాయంతో ఆ గెడ్డ దాటి వెళ్లి 40 మందికి టీకా వేశారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది గతంలోనూ మన్యంలో కొండలు దాటి వెళ్లి పొలాల వద్ద పనులు చేసుకుంటున్న గిరిజనులకు టీకాలు వేశారు.
విధుల పట్ల అంకితభావమే... వాగు దాటొచ్చేలా చేసింది..! - ANM worker crossed stream for vaccination
విధి నిర్వహణ పట్ల ఎనలేని అంకితభావాన్ని చూపించారు ఆ ఏఎన్ఎం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా... ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో దిగి, ఆవలి ఒడ్డుకు చేరుకుని టీకా వేశారు.
వ్యాక్సినేషన్ కోసం వాగు దాటిన ఏఎన్ఎం
TAGGED:
వాగు దాటిన ఏఎన్ఎం