విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఐక్యకార్యాచరణ శాంతిసమితి ఆధ్వర్యంలో.. "డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం సముచితం" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వ విద్యాలయ అధ్యాపకులు, నగర ప్రముఖులు ఈ చర్చలో పాల్గొన్నారు.
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడం ఒక అదృష్టం. రాజ్యాంగ రచయిత పేరు కోనసీమ జిల్లాకు వచ్చిందని గర్వపడాలి. మిగిలిన జిల్లాల వాళ్లు ఈ మంచి అవకాశం రాలేదని బాధపడాలి. - ఆచార్య డీవీఆర్ మూర్తి, ఆంధ్ర విశ్వ విద్యాలయం డీన్
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని ఎక్కువ వినతులు వెళ్లాయని.. ఎన్టీఆర్ కూడా తిరుపతి సీటును అంబేడ్కర్ కుమార్తెకు ఇవ్వాలని అనుకున్నారని విశ్వవిద్యాలయ అధ్యాపకులు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది దళిత ప్రజా ప్రతినిధులు కోనసీమ జిల్లా నుంచే వచ్చారని.. అంబేడ్కర్‌ను ఒక కులానికి పరిమితం చేయద్దని.. ఆయన ఒక ప్రపంచ దిశా నిర్దేశిత ఆదర్శ మూర్తి అన్నారు. కృష్ణుడు గీత ఇచ్చారు.. జీసస్ బైబిల్ ఇచ్చారు.. అల్లా ఖురాన్ ఇచ్చారు.. అంబేడ్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చారని అన్నారు.