ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులకు అవసరమైన వసతి కల్పనకు యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వై.ఎం.సీ.ఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ పాలకమండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, వై.ఎం.సీ.ఏ అధ్యక్షులు మేథ్యూ పీటర్ సంతకాలు చేశారు. అనంతరం వర్సిటీ వీసీ ఆచార్య పీ.వీ.జీ.డీ.ప్రసాద్‌రెడ్డి విదేశీ విద్యార్థులకు అవసరమైన వసతి కల్పనకు వై.ఎం.సీ.ఏ ముందుకు వచ్చిందన్నారు. దీంతోపాటు విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులను కల్పిస్తుందని చెప్పారు.
విదేశీ విద్యార్థులకు కోసం వై.ఎం.సీ.ఏ అవగాహన ఒప్పందం
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులకు అవసరమైన వసతి కల్పనకు యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వై.ఎం.సీ.ఏ) ముందుకువచ్చింది. విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులను కల్పించేందుకు ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వై.ఎం.సీ.ఏ అవగాహన ఒప్పందం