ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 10న ఆంధ్ర వర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం - ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం వార్తలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈనెల 10వ తేదీ నిర్వహిస్తున్నట్టు ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కరోనా కారణంగా ఈసారి పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుక జరుపుతున్నట్లు తెలిపారు.

prasada reddy
ప్రసాదరెడ్డి, ఆంధ్ర వర్శిటీ ఉపకులపతి

By

Published : Dec 8, 2020, 9:55 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈనెల 10వ తేదీ నిర్వహిస్తున్నట్టు ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశ్వ విద్యాలయం వ్యవస్థాపకులు సర్ కట్టమంచి రామలింగారెడ్డి పుట్టినరోజున ఏటా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ఏడాది పూర్తిగా దృశ్య మాధ్యమ విధానంలో ఈ సమ్మేళనం చేపడతామని చెప్పారు. ఈ వేడుకకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ అంతర్జాలం ద్వారా ఈ వేడుకలో పాల్గొనాలని ఉపకులపతి కోరారు. ఇప్పటికే పాల్గొనే ప్రముఖులకు అంతర్జాల సమావేశ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details