ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 8, 2022, 10:42 PM IST

ETV Bharat / city

AP ICET results: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ICET-2022: 2022 ఏడాదికి జులై 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐసెట్​-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 87.83శాతం మంది అర్హత సాధించారు. తొలి 10 ర్యాంకుల్లో బాలురు ఏడు ర్యాంకులు సాధించగా... బాలికలు 3 ర్యాంకుల్లో నిలిచారు.

icet results
icet results

ICET Results: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సోమవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షలో 87.83శాతం అర్హత సాధించారు. జులై 25న రాష్ట్రవ్యాప్తంగా 24నగరాలతో పాటు హైదరాబాద్‌లో మొత్తం 107 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా పరీక్షకు 49,157 మంది దరఖాస్తు చేస్తున్నారు. వారిలో 42,496 మంది పరీక్షకు హాజరు కాగా.. 37,326 మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు.

బాలుర ఉత్తీర్ణత శాతం 87.98 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 87.68శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. తొలి 10ర్యాంకుల్లో బాలురు 7 ర్యాంకులు సాధించగా, బాలికలు 3 ర్యాంకుల్లో మెరిశారు. తిరుపతికి చెందిన రెడ్డప్పగారి కేతన్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. గుంటూరుకు చెందిన డి.పూజిత వర్ధన్‌ రెండో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్‌.వంశీభరద్వాజ్‌ మూడో ర్యాంకు సాధించాడు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details