ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ISO CERTIFICATION: విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ - కలెక్టర్ డాక్టర్. మల్లిఖార్జున

విశాఖలోని ఆంధ్రా వైద్య కళాశాలకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ ధృవీకరణ లభించింది. హెచ్​వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్ధ వివిధ అంశాల ఆధారంగా దీనిని అందించింది.

విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ
విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ

By

Published : Aug 19, 2021, 5:13 PM IST

విశాఖలోని ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విధమైన ధృవీకరణ రావడంతో కళాశాల తన ప్రత్యేకతను చాటి చెప్పినట్లయింది. హెచ్​వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్ధ.. ఈ ధృవీకరణను వివిధ అంశాల అధారంగా జారీ చేసింది.

మంచి నిర్వహణా పద్దతులు అనుసరించడం, సంస్థ యాజమాన్యంలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధారంగా దీనిని అందజేస్తారు. ఈ మేరకు ఆ సంస్ధ ప్రతినిధి ఎ.శివయ్య ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్. పీవీ. సుధాకర్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్. మల్లిఖార్జున సమక్షంలో అందజేశారు. ఉత్తమ పద్ధతులను అనుసరించి వైద్య విద్యా సంస్థను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్​కు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details