ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పశువుల పాక దగ్ధం... వృద్ధుడు సజీవదహనం

పశువుల పాకలో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాడు. ఈ హృదయ విదారక సంఘటన విశాఖ జిల్లా రొంగలినాయుడుపాలెంలో జరిగింది.

an old man
అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన వృద్ధుడు

By

Published : Dec 7, 2020, 8:32 PM IST

రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు

పశువుల పాకలో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో జరిగింది. ఈ ప్రమాదంలో పాడి పశువు కూడా చనిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అనపర్తి చిన్న (65) అనే వ్యక్తి రోజులాగే పశువుల పాకలో నిద్రపోయాడు. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు పాకకు నిప్పుంటుకుని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలం ఊరికి దూరంగా ఉండటంతో బంధువులు, గ్రామస్థులు సకాలంలో వెళ్లలేకపోయారు. మంటలో చిక్కుకుని వృద్ధుడితో పాటు.. పాడి పశువు మృత్యువాత పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో..

మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ పసుపువాని వలసలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. రూ.ఐదు లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. అంతా పంట పొలాల్లో పనుల్లో నిమగ్నమైన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇళ్లు పూర్తిగా కాలిపోవటంతో వారంతా కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.

ఇదీ చదవండి: ఇద్దరు మృతి: రక్షణ కోసం కంచె కడితే భక్షించింది

ABOUT THE AUTHOR

...view details