విశాఖ పోర్టుకు అమ్మోనియం నైట్రేట్‌ను తీసుకువచ్చిన మూడు నౌకలు అన్లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నాయని.. పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు వెల్లడించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఈ విషయాన్ని తెలియజేశామని, ప్రస్తుతం వీటి నిల్వకు సంబంధించిన అనుమతులు ఎవరికి ఇవ్వకపోవడం వల్ల వేచి ఉండాల్సిన పరిస్దితి నెలకొందన్నారు.
వాస్తవంగా ఇప్పుడు వచ్చిన 3 నౌకల అమ్మోనియం నైట్రేట్... కేవలం ఎరువుల గ్రేడ్‌కి సంబంధించినదని వివరించారు. ఎవరైతే దీనిని దిగుమతి చేసుకున్నారో.. నేరుగా నౌకనుంచి వారి గమ్యానికే రహదారి మార్గం ద్వారా పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రామ్మోహనరావు వివరించారు.