ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ శిల్పారామంలో క్రాఫ్ట్స్ మేళా.. ప్రారంభించిన మంత్రి అవంతి

విశాఖ మధురవాడలో ఏర్పాటు చేసిన అఖిల భారత హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళాను మంత్రి అవంతి శ్రీనివాస్ అమరావతి నుంచి వర్చువల్​గా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్స్ మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి 30 వరకు మేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

All India craft mela 2020
All India craft mela 2020

By

Published : Dec 16, 2020, 4:14 PM IST

విశాఖ మధురవాడ శిల్పారామంలో ఏర్పాటు చేసిన అఖిల భారత హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళాను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అమరావతి సచివాలయం నుంచి వర్చువల్​గా ఈ మేళాను మంత్రి ప్రారంభించారు. చేనేత కళాకారులతో పాటు హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టిందని మంత్రి వెల్లడించారు.

విశాఖలో నిర్వహిస్తున్న హస్త కళా ఉత్పత్తుల మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. రాష్ట్రంలో ఈ తరహా క్రాఫ్ట్స్ మేళాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదిహేను రోజుల పాటు అఖిల భారత హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖకు చెందిన హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్ విభాగం సహకారంతో రాష్ట్ర శిల్పారామం సొసైటీ ఈ క్రాఫ్ట్స్ మేళా నిర్వహిస్తుంది.

ఇదీ చదవండి :'డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలుంటాయి'

ABOUT THE AUTHOR

...view details