పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా బ్యాంకు రిటైరీస్ సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. 1986 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వయో వృద్ధులకు.. ఇప్పటికీ 4 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంపై సమాఖ్య సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గత 25 ఏళ్లలో భారతదేశ తలసరి ఆదాయం పెరిగినా.. బ్యాంకు ఉద్యోగులకు చాలీచాలని పెన్షన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకూ కుటుంబ పెన్షన్ పెంచాలని.. వృద్ధుల బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
'విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ పెంచాలి' - విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా
పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా బ్యాంకు రిటైరీస్ సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకూ కుటుంబ పెన్షన్ పెంచాలని కోరింది.
!['విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ పెంచాలి' All India Bank Retirees Federation Agitation in vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5796392-949-5796392-1579673524124.jpg)
విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా
విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా