ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Akhanda unit in Simhachalam: అప్పన్న సన్నిధిలో 'అఖండ' చిత్ర యూనిట్ - సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

Akhanda Movie unit in simhachalam: విశాఖ సింహాద్రి అప్పన్నను "అఖండ" చిత్ర బృందం దర్శించుకున్నారు. సినిమా కథానాయకుడు బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.

అప్పన్న సన్నిధిలో అఖండ చిత్ర యూనిట్
అప్పన్న సన్నిధిలో అఖండ చిత్ర యూనిట్

By

Published : Dec 9, 2021, 10:43 AM IST

Updated : Dec 9, 2021, 4:47 PM IST

అప్పన్న సన్నిధిలో అఖండ చిత్ర యూనిట్

Akhanda Movie unit in simhachalam: విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనతో పాటు అఖండ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత రవీందర్‌రెడ్డి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

వేద మంత్రాల నడుమ ఆలయ అధికారులు చిత్ర బృందానికి స్వాగతం పలికారు. చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వామివారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందించారు.

సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ
Balakrishna visit Subramanya Swamy Temple at Visakhapatnam: విశాఖపట్నం జిల్లా ఎన్ఏడీలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ సందర్శించారు. సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా ఇవాళ ఉదయం స్వామిని బాలయ్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను.. స్వామివారిని దర్శించుకున్నారు. అఖండ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ రాకతో ఆలయం వద్ద ఆయన కోసం ప్రజలు ఎగబడ్డారు. కాసేపు బాలకృష్ణ నవ్వుతూ అభివాదం చేశారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 9, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details