ప్రతి 3నెలలకోసారి విడుదలయ్యే ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) రేటింగ్‌ల్లో విశాఖ విమానాశ్రయం ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి కొన్ని విభాగాల్లో ముందు వరుసలో నిలిచింది. ఓవరాల్ రేటింగ్‌లు ఇలా ఉన్నాయి.
త్రైమాసికం | రేటింగ్ | ర్యాంకు |
2018 అక్టోబరు-డిసెంబరు | 4.55 | 79 |
2019 జనవరి-మార్చి | 4.60 | 75 |
" ఏప్రిల్-జూన్ | 4.53 | 88 |
" జులై-సెప్టెంబరు | 4.23 | 160 |
" అక్టోబరు-డిసెంబరు | 4.59 | 85 |
2020 జనవరి-మార్చి | 4.63 | 79 |
ప్రయాణికుల సంతృప్తి స్థాయిలిలా..
త్రైమాసికం | ప్రయాణికులిచ్చిన రేటింగ్ | (ప్రపంచ సగటు) |
2018 అక్టోబరు-డిసెంబరు | 4.55 | (4.22) |
2019 జనవరి-మార్చి | 4.60 | (4.25) |
" ఏప్రిల్-జూన్ | 4.53 | (4.24) |
" జులై-సెప్టెంబరు | 4.23 | (4.22) |
" అక్టోబరు-డిసెంబరు | 4.59 | (4.26) |
2020 జనవరి-మార్చి | 4.63 | (4.24) |
పరిమిత ప్రయాణికులు-అత్యున్నత ఏర్పాట్లు
- కరోనా నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో ప్రత్యక చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల భద్రత, వేగవంతమైన స్క్రీనింగ్, ఇతర ధృవపత్రాల పరిశీలన, పనితీరులో సిబ్బంది చాలా చురుగ్గా వ్యవహరించింది.
- పాస్‌పోర్టు పరిశీలన, ఐడీ వెరిఫికేషన్ విభాగాల్లో అత్యున్నతంగా వృద్ధి చెందాయి. అక్కడి వేగానికి ప్రయాణికులు పూర్తి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
- పార్కింగ్, ట్రాలీ సదుపాయం, సిబ్బంది పనితీరు, భద్రత, విమాన సర్వీసుల సమయాల ప్రదర్శన, టెర్మినల్ లోపల నడక వసతి, వైఫై, బ్యాగేజీ డెలివరీ, కస్టమ్స్ అధికారుల పరిశీలన తదితర విభాగాల్లో గతం కంటే మెరుగ్గా ఉన్నట్లు ఫలితాలొచ్చాయి.
ఇంకాస్త..