ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఓం'.. గాలి నాణ్యతను ఇట్టే పసిగట్టేస్తోంది..!

వాతావరణ కాలుష్య కారకాలను గుర్తించేందుకు అతి తక్కువ పరిమాణంలో ఓ పరికరాన్ని రూపొందించారు విశాఖ గాయత్రి విద్య పరిషత్ సంచాలకులు ఆచార్య తటవర్తి రావు. గాలిలో కాలుష్య కారకాలను సెకండ్ల వ్యవధిలోనే గుర్తించేలా ఎయిర్ యూనిక్ క్వాలిటీ (ఓం) యంత్రాన్ని తయారుచేశారు. ఈ ఆవిష్కరణపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ప్రొఫెసర్ రావు సేవలను వినియోగించుకుంటామన్నారు.

'ఓం'.. గాలి నాణ్యతను ఇట్టే పసిగట్టేస్తోంది..!
'ఓం'.. గాలి నాణ్యతను ఇట్టే పసిగట్టేస్తోంది..!

By

Published : Aug 17, 2020, 6:50 PM IST

విశాఖ గాయత్రి విద్య పరిషత్ సంచాలకులు ఆచార్య తటవర్తి రావు తన విద్యార్థి బృందంతో కలిసి గాలి నాణత్యను పరీక్షించేందుకు ఒక పరికరాన్ని రూపొందించారు. వాతావరణ కాలుష్యాన్ని కనుగోనేందుకు ఓ మానిటరింగ్ వ్యవస్థను తయారుచేశారు. వీరు రూపొందించిన పరికరాన్ని ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్(ఓం)గా వ్యవహరిస్తారు. గాలిలో ఉండే కాలుష్య కారకాలను సెకండ్ల వ్యవధిలోనే ఈ పరికరం గుర్తించగలదని రావు తటవర్తి తెలిపారు. ఈ ఆవిష్కరణపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. ఆ పరికరాన్ని రూపొందించిన రావు సేవలను వినియోగించుకుంటామని.. తగిన ప్రోత్సాహకం అందిస్తామన్నారు.

360 డిగ్రీలలో పరిశీలన

చూడడానికి సీసీ కెమెరా పరిమాణంలో ఉన్న ఓం పరికరం 360 డిగ్రీలలో తిరుగుతూ గాలిలో తేమను, ఆవిరిని, కాలుష్య కారకాలను గుర్తిస్తుంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన ప్రాంతంలోని ఏ తరహా కాలుష్య కారకాలు ఉన్నాయో ఈ పరికరం ద్వారా విశ్లేషించవచ్చని రూపకర్తలు అంటున్నారు.

ఫోటాన్ సాయంతో

వాతావరణ కాలుష్యాన్ని కనుగొనేందుకు వినియోగించే పరికరాలు చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయని తటవర్తి రావు అన్నారు. ఆ యంత్రాలతో ఎక్కడి పడితే అక్కడ కాలుష్యాన్ని కొలిచేందుకు వీలు కాదన్నారు. ఆ సమస్యకు పరిష్కారంగా ఫోటాన్(కాంతి)ని ఉపయోగించుకుని తక్కువ పరిమాణంలో ఓం పరికరాన్ని రూపొందించామని తెలిపారు. ఈ యంత్రంలో గాలిలోని అన్ని కాలుష్య కారకాలను ఏకకాలంలో కనుక్కోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి :విశాఖలో తితిదే దేవాలయం... తుది దశకు నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details