విశాఖ నగరంలో దీపావళి వేళ కాల్చిన టపాసులు గాలిని తీవ్రంగా కలుషితం చేశాయి. శనివారం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు టపాసుల ప్రభావం కనిపించింది. రాత్రి 10 గంటల సమయంలో అత్యధిక కాలుష్యం రికార్డు అయ్యింది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు ఏకంగా 419 మైక్రోగ్రాములుగా, పీఎం 10 రేణువులు 321 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. గతేడాది దీపావళిలో ఈ విలువ పీఎం 2.5కు 847, పీఎం 10కు 992గా ఉంది. 2019తో పోల్చితే సగటున సగం కన్నా తక్కువగా బాణసంచా కాల్చారని నిర్థరణ అవుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి కాలుష్యం తగ్గడం మొదలైనట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖలో తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లిన టపాసులు - Deepawali celebrations 2020 news
విశాఖలో దీపావళి వేడుకల కారణంగా ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యమైంది. అయితే కరోనా కారణంగా గతేడాది కంటే తక్కువ స్థాయిలో గాలి కాలుష్య సూచీ గణాంకాలు నమోదయ్యాయి.
vishaka
మొత్తం మీద 24 గంటల్లో కాలుష్య తీవ్రత చూస్తే సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా పీఎం2.5 గాలి కాలుష్య సూచీ సగటన 126గా ఉన్నట్లు తెలిపారు. మాధ్యమిక స్థాయిలో కాలుష్యముందని అధికారులు వెల్లడించారు. శ్వాసకోశ వ్యాధులున్నవారికి ఈ వాతావరణం కాస్త ఇబ్బందికరమని తెలిపారు.
ఇదీ చదవండి