ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రమాదకర గ్యాస్​.. ప్రభావితులు జాగ్రత్తలు తీసుకోవాలి' - aiims director addressed visakha gas incident

విశాఖ ఘటనలో విడుదలైన గ్యాస్​ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా తెలిపారు. బాధితులు చాలా జాగ్రత్త వహించాలని.. మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమలు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

'ప్రమాదకర గ్యాస్​.. ప్రభావితులు జాగ్రత్తలు తీసుకోవాలి'
'ప్రమాదకర గ్యాస్​.. ప్రభావితులు జాగ్రత్తలు తీసుకోవాలి'

By

Published : May 7, 2020, 5:11 PM IST

Updated : May 7, 2020, 5:40 PM IST

విశాఖ గ్యాస్​ ఘటనలో ప్రభావితులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా సూచించారు. గ్యాస్ పీల్చిన వారికి కళ్లు, గొంతునొప్పి, వాంతులు అయ్యాయని అన్నారు. ప్రమాదకర రసాయనం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. విష వాయువు ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం ఆగిపోయి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయన్నారు.

బాధితులు వెంటనే ఆక్సిజన్​ థెరపీ తీసుకోవాలని.. మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ పేర్కొన్నారు. పరిశ్రమలన్నీ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలన్న ఆయన.. కార్మికులు భౌతిక దూరం పాటించాలన్నారు.

Last Updated : May 7, 2020, 5:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details