Agniveer rally in Visakha కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో ప్రారంభమైంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుందని అధికారులు తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్, నీటి సరఫరా కల్పించారు.
విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ - అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం
Agniveer rally in Visakha కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో మొదలైంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు 18 రోజుల పాటు జరిగే ర్యాలీకి అన్ని సదుపాయాలు కల్పించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ర్యాలీని విజయవంతం చేయడానికి కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణ చేస్తున్నారు.
నగరంలో 18 రోజులపాటు జరిగే అగ్ని వీర్ నియామకాలకు సంబంధించి.. వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రన్నింగ్ ట్రాక్‌పై నీరు, బురద లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ర్యాలీని విజయవంతం చేయాడానికి కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున పర్యవేక్షణ చేస్తున్నారు. 13 జిల్లాల నుంచి అభ్యర్థులు వస్తారని తెలిపారు.
ఇవీ చదవండి: