ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ADAVISESH: దిశ యాప్‌తో మహిళలకు ఎంతో రక్షణ..: నటుడు అడవి శేషు - vishakapatnam news

విశాఖ ఆర్కే బీచ్​లో సినీనటుడు అడివి శేషు సందడి చేశారు. దిశ యాప్​పై పోలీసుశాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు.

ADAVISESH
ADAVISESH

By

Published : Aug 22, 2021, 8:43 PM IST

సినీనటుడు అడివి శేషు విశాఖలో సందడి చేశారు. విశాఖ రామకృష్ణ బీచ్​లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద విశాఖ పోలీస్ కమిషరేట్, దిశ వింగ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సినీ నటుడు దర్శకుడు అడవి శేషు పాల్గొన్నారు. దిశ చట్టం గురించి అవగాహన కల్పించి.. దిశా యాప్​ను మహిళలందరూ వినియోగించుకోవాలని సూచించారు. మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

అన్నాచెల్లెళ్లు పండుగైన రాఖీ రోజున దిశ యాప్​పై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ దిశ యాప్ లో పెట్టే ఫిర్యాదులకు తక్షణమే పోలీసులు స్పందిస్తారని చెప్పుకొచ్చారు. విశాఖ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గౌతమీ శాలి, ఏసీపీలు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

ఇదీ చదవండి:alluri : స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు... సాయుధ పోరాటంలో అసాధ్యుడు

ABOUT THE AUTHOR

...view details