విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశాన్ని వైకాపా నిర్వహించింది. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ అన్నారు. వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరోవైపు.. రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి వైకాపా ఎంపీ విజయసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైకాపాకు నగర పాలక సంస్థ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఇలాంటి రాజకీయ సమావేశానికి.. ఏయూ వీసీ హాజరు కావడంపై.. టీఎన్ఎస్ఎఫ్ నేతలు అభ్యతరం చెప్పారు.