విశాఖ జిల్లాలోని జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ షకీలా ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీ రామచంద్ర రావు ఈ దాడులు నిర్వహించారు. సాధారణంగా కొనసాగే తనిఖీలేనని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో… పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులు, ఇతర విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా జె. శివశంకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కార్యాలయంలో లేరు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు లక్ష్మణ మూర్తి, రమేష్, గఫూర్, కిషోర్ పాల్గొన్నారు.
విశాఖలో అనిశా దాడులు.. సాధారణమే అంటున్న అధికారులు - acb raids in visakha
విశాఖలోని జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే... ఇవి సాధారణంగా జరిగే తనిఖీలేనని అధికారులు చెబుతున్నారు.
![విశాఖలో అనిశా దాడులు.. సాధారణమే అంటున్న అధికారులు ACB Raids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2020-09-08-16h06m22s957-0809newsroom-1599561461-90.jpg)
అనిశా దాడులు