విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి - విశాఖలో యువతిపై కత్తితో దాడి
12:15 December 02
సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న యువతిపై కత్తితో దాడి
గత నెలలో గాజువాక యువతి హత్యోదంతం మరువకముందే.. విశాఖలో మరో దారణం చోటు చేసుకుంది. థాంసన్ స్ట్రీట్ వద్ద ప్రియాంక అనే యువతి మెడపై.. శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. సచివాలయంలో వాలంటీర్ గా పనిచేసే ప్రియాంక ఇంట్లో ఉన్న సమయంలో... ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తానూ గాయపరుచుకున్నాడు. రక్తస్రావమైన ఇద్దరినీ స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రేమించానంటూ శ్రీకాంత్ వేధించాడని, పెళ్లికి అంగీకరించకపోవడంతోనే దాడి చేశాడని ప్రియాంక కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: