విశాఖ జిల్లా గాజువాక గిరిజన నర్సింగ్ కాలేజీనుంచి ఉత్తీర్ణత పొందిన ఓ యువతి.. ఆ కళాశాల ప్రిన్సిపాల్ పై ఆరోపణలు చేసింది. లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. స్థానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంపచోడవరానికి చెందిన గిరిజన యువతి.. మదర్ థెరిస్సా కాలేజీలో నర్సింగ్ పూర్తి చేసింది.
Harassment: 'ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడు.. కాపాడండి' - latest news in vishaka district
ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. విశాఖలోని గిరిజన నర్సింగ్ కాలేజీ నుంచి ఉత్తీర్ణత పొందిన ఓ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య డిమాండ్ చేసింది.
విద్యార్ధిణిని వేధిస్తున్న ప్రిన్సిపల్
పాసైనట్టు సర్టిఫికెట్ కావాలంటే లైంగిక వాంఛ తీర్చాలని ప్రిన్సిపాల్ వెంకటరావు వేధిస్తున్నట్టు ఆమె ఆరోపించింది. స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలికి తాము అండగా ఉన్నామని.. జాతీయ గిరిజన సమాఖ్య సభ్యులు ఉప్పల శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ..కృష్ణానదికి పోటెత్తుతున్న వరద... ముంపు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ