'ప్లాస్టిక్ పునర్వినియోగ పరిశ్రమల్లో వాణిజ్య అవకాశాలు' అనే అంశంపై విశాఖలోని వాసవీ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రసాయన శాస్త్ర నిపుణుడు డాక్టర్ దీన్ చందూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామిక రంగం నూతన పరిశోధనలను వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన పరిశోధనల ఆధారంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగాలని అన్నారు. భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా చెయ్యడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాసవీ చైతన్య ఫౌండేషన్ అధ్యక్షురాలు పాలూరి శేషుమాంబ, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ పునర్వినియోగంపై విశాఖలో అవగాహన - plastic recycling techinques seminar in visakha
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామిక రంగం నూతన పరిశోధనలను ఉపయోగించి కృషి చేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వాసవీ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో 'ప్లాస్టిక్ పునర్వినియోగ పరిశ్రమల్లో వాణిజ్య అవకాశాలు' అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

'విశాఖలో ప్లాస్టిక్ పునర్వినియోగంపై అవగాహన సదస్సు'
'విశాఖలో ప్లాస్టిక్ పునర్వినియోగంపై అవగాహన సదస్సు'