ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీస్​ కమిషనర్ కార్యాలయం వద్ద కత్తితో వ్యక్తి హల్​చల్​ - vizag crime news

విశాఖలో శుక్రవారం రాత్రి కత్తితో పోలీస్​ కమిషనర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీస్​ కమిషనర్ కార్యాలయం వద్ద కత్తితో వ్యక్తి హల్​చల్​
పోలీస్​ కమిషనర్ కార్యాలయం వద్ద కత్తితో వ్యక్తి హల్​చల్​

By

Published : May 31, 2020, 12:15 AM IST

విశాఖలో ఓ వక్తి పోలీస్​ కమిషనర్ కార్యాలయం వద్ద కత్తితో కలకలం సృష్టించాడు. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఓ స్థిరాస్తి సంస్థలో పనిచేసిన మహేశ్వరరావు అనే వ్యక్తి... తన వేతనం బకాయి వసూలు చేసుకునేందుకు కార్యాలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో వారితో జరిగిన ఘర్షణ అనంతరం పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. సీపీ కార్యాలయం గేటు వద్ద తనిఖీ చేయగా పోలీసులు అతని వద్ద ఓ కత్తిని గుర్తించారు. ఈ విషయమై ఆ వ్యక్తిని రెండవ పట్టణ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. మహేశ్వరరావు నర్సీపట్నం మండలం కేడీపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కత్తితో కలకలం సృష్టించిన అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:'మేము చనిపోయినా పట్టించుకునేవారు లేరు'

ABOUT THE AUTHOR

...view details