సాయం కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి 'స్పందన' లేదు. కనీసం అవయవాలు అమ్ముకునేందుకైనా అవకాశం ఇవ్వండి అంటూ అర్జీ పెట్టుకుంది విజయవాడకు చెందిన ఓ ముస్లిం సోదరి. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ఈ యువతి పేరు నఫీసా. 10వ తరగతి వరకూ చదివింది. అనారోగ్యం బారిన పడ్డ తల్లిదండ్రులు... కుటుంబ అవసరాలకు సోదరుడి నెల జీతం సరిపోని కారణంగా... ఉన్నత చదువులు చదవలేకపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. ఏదైనా షాపు పెట్టుకునేందుకు లోన్ కోసం... ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అధికారులు కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ప్రభుత్వం సాయం చేయాలని.. లేకపోతే కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పోషించుకునేందుకు తన అవయవాలు అయినా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని వేడుకుంటోంది. మరి ప్రభుత్వం నఫీసా విజ్ఞప్తిపై స్పందిస్తుందా ? లేదా చూడాలి.
'అవయవాలు అమ్ముకుంటా... అనుమతి ఇవ్వండి'
సాయం అందించాలని ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టుకుంది. కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగింది. ఎంతోమంది అధికారులను బతిమలాడుకుంది. ఎలాంటి ఫలితం లేదు. సహనం నశించిన ఆమె చివరకు అవయవాలను అమ్మి తల్లిదండ్రులను పోషించాలనుకుంటోంది.
ఆర్గాన్స్ అమ్ముకుంటా... పర్మిషన్ ఇవ్వండి సార్