విశాఖ గాజువాక పీఎస్‌లో 11 మంది కాకినాడ వాసులపై అక్రమ నిర్బంధం కేసు నమోదైంది. విశాఖ డైరీ వద్ద ఓ వ్యక్తిని కారులో బలవంతంగా ఎక్కించారని కాకినాడ వాసులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్రమత్తమైన పోలీసులు కూర్మన్నపాలెం సమీపంలో నిందితులను పట్టుకున్నారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తి మాస అగస్టీన్‌గా గుర్తించారు.
విశాఖలో మరో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు - విశాఖ వాసిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కాకినాడు వాసులు
విశాఖ గాజువాక పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు బలవంతంగా కారులో తీసుకెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిందితులను కాకినాడ వాసులుగా గుర్తించారు. వారిపై అక్రమ నిర్బంధం కేసు నమోదుచేశారు. నిర్బంధించిన వ్యక్తి... ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకే నిర్బంధించే ప్రయత్నం చేశామని నిందితులు ఒప్పుకున్నట్లు చెప్పారు.
విశాఖలో మరో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు
అగస్టీన్ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. సుమారు రూ. 66 లక్షలు మేర వసూలు చేశాడని అగస్టీన్‌పై 5 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్నారు. ఇచ్చిన డబ్బు వసూలు చేసుకునేందుకు అగస్టీన్‌ను నిర్బంధించి కాకినాడకు తీసుకెళ్తున్నామని నిందితులు తెలిపారు.
ఇదీ చదవండి :అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్