ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Big Fish: పూడిమడకలో భారీ టేకు చేప.. ధర ఎంతంటే? - పూడిమడకలో భారీ టేకు చేప

Teak Fish: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. వారి వలకు భారీ టేకు చేప లభించింది. దానిని అతికష్టం మీద తీరానికి తీసుకొచ్చారు.

Teak Fish in pudimadaka
పూడిమడకలో భారీ టేకు చేప

By

Published : Mar 10, 2022, 2:04 PM IST

Teak Fish: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ చేప పడింది. 20 మంది జాలరులు అతికష్టం మీద తీరానికి తీసుకొచ్చారు.

టేకు చేప తినేందుకు పనికిరాదని.. ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని పూడిమడక మెరైన్ ఎస్సై మల్లేశ్వరరావు తెలిపారు. దీన్ని ముక్కలుగా కోసి కాకినాడలో విక్రయించడానికి తరలించారు. ఈ టేకు చేప ధర రూ.50వేల వరకు పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details