ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉక్రెయిన్ నుంచి క్రమక్రమంగా సొంతూళ్ళకు చేరుకుంటున్న విద్యార్థులు... ఆనందంలో ఆత్మీయులు - ఉక్రేయినలో చిక్కుకున్న విద్యార్థులు

ఉక్రెయిన్​లో చిక్కుకున్న మరికొంత మంది విద్యార్థులు క్షేమంగా రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ, బెంగళూరు మీదుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 21 మంది విద్యార్థులు చేరుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు తనకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు

విద్యార్థులు
విద్యార్థులు

By

Published : Mar 6, 2022, 4:48 PM IST

ఉక్రెయిన్​లో చిక్కుకున్న మరికొంత మంది విద్యార్థులు క్షేమంగా రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ, బెంగళూరు మీదుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 21 మంది విద్యార్థులు చేరుకున్నారు. విద్యార్థులంతా ఉక్రెయిన్ లోని జాపోరిజ్జియా స్టేట్ వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన వారిగా గుర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిసి రెవెన్యూ, ఇంటెలిజెన్స్ సిబ్బంది, భాజాపా నేతలు స్వాగతం పలికారు. దగ్గరుండి సొంతూళ్లకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సరిహద్దు చేరుకునేందుకు..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవడం పట్ల వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని అక్కయ్యపాలానికి చెందిన కవిత... క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. ఎంబీఏ చదివేందుకు ఉక్రెయిన్‌ వెళ్లిన విద్యార్థిని కవిత... సరిహద్దు చేరుకునేందుకు ఇబ్బందులు పడినట్లు తెలిపారు. సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు తనకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా చేరుకుంటున్న విద్యార్థులు... ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

ప్రత్యేక విమానంలో..

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన విద్యార్థుల్లో నలుగురు... సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి.. అనంతరం స్వస్థలాలకు చేరుకున్నారు. మండవల్లి మండలం అప్పాపురానికి చెందిన వైద్య విద్యార్థి చావలి వెంకట కృష్ణ చైతన్య ఇంటికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డకు చెందిన వైద్య విద్యార్థి నల్లపాటి ప్రేమ్ కుమార్ సైతం... క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. తమ పిల్లలు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. స్వస్థలాలకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషిని మరువలేమని విద్యార్థులు అన్నారు.

ఇదీ చదవండి:Ukraine President: 'నన్ను సజీవంగా చూడడం ఇదే ఆఖరేమో'

ABOUT THE AUTHOR

...view details