ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOPNEWS : ప్రధాన వార్తలు @ 9AM - andhra pradesh top news

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM

By

Published : Dec 12, 2021, 9:00 AM IST

  • saiteja Funeral: నేడు లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు

saiteja Funeral: తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగుతేజం..... లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి. భౌతికకాయం స్వగ్రామం వచ్చేందుకు ఆలస్యమవటంతో శనివారం జరగాల్సిన అంత్యక్రియలు నేటికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CHANDRABABU FIRE ON CM JAGAN : ప్రత్యేక హోదాపై రాజీనామాలకు సిద్ధం..మీరు సిద్ధమా!: చంద్రబాబు

Chandrababu Fire on YSR Congress Party Ruling : వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పాక..వైకాపా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Pawan: నేడు పవన్ కల్యాణ్‌ 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'.. ఏర్పాట్లు పూర్తి

Visakha ukku parirakshana deeksha: గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు పవన్ కల్యాణ్‌ చేపట్టనున్న 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పవన్ దీక్ష కొనసాగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మేడ్చల్ : బౌరంపేటలో ప్రమాదం...ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం

హైదరాబాద్​లోని మేడ్చల్ బౌరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • PM Modi twitter: ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

PM Modi twitter: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • China US news: ప్రజాస్వామ్య సదస్సు.. అమెరికాపై చైనా తీవ్ర వ్యాఖ్యలు!

China Slams US: ప్రజాస్వామ్యం పేరుతో ప్రపంచంలో భారీగా విధ్వంసం సృష్టించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా ఆరోపించింది. దీనిని ఒక ఆయుధంగా వాడుకొని విభజనలు, వివాదాలు సృష్టిస్తోందని విమర్శించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాస్వామ్య సదస్సును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Debt of india: దేశం అప్పు రూ.135 లక్షల కోట్లు

India debt 2021: గత 70 ఏళ్లలో భారతదేశ అప్పు 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆసియా రోయింగ్​లో స్వర్ణంతో మెరిసిన భారత జోడీ

Asian Rowing Championships 2021: ఆసియా రోయింగ్ ఛాంపియన్​ షిప్​ పురుషుల డబుల్స్ విభాగంలో భారత రోయర్లు అర్జున్ లాల్-రవి స్వర్ణం కైవసం చేసుకున్నారు. సింగిల్ స్కల్స్​లో పర్మీందర్ సింగ్ రజతం గెలిచాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏఆర్​ రెహ​మాన్​ ఉదారత..పేద విద్యార్థులను సంగీతకళాకారులుగా

AR Rahman Sunshine Orchestra: తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఏఆర్‌. రెహమాన్​. స్వీయ సంగీత దర్శకత్వంలో పాటలు పాడి యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు. అయితే ఆయనలో ఓ మంచి వ్యక్తి కూడా ఉన్నారు. ఎన్నో సేవకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details