రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్జీయూకేటీసెట్)కు 96శాతం మంది హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 638 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 88,974మంది దరఖాస్తు చేయగా.. వీరిలో 85,760మంది పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61శాతం మంది పరీక్ష రాయగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 95.38 శాతం మంది హాజరయ్యారు.
ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షకు 96 శాతం మంది హాజరు - RGUKT entrance test news
ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షకు 96 శాతం మంది హాజరయ్యారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61 శాతం మంది పరీక్ష రాశారు. అత్యల్పంగా విశాఖలో 95.38 శాతం మంది హాజరయ్యారు. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలను ఎల్లుండి సాయంత్రం 5 గంటలలోగా నమోదు చేయాలని ఆర్జీయూకేటీ వీసీ హేమచంద్రారెడ్డి సూచించారు.
ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షకు 96 శాతం మంది హాజరు
తెలంగాణలోని ఖమ్మంలో 95 శాతం, నిజామాబాద్‌లో 86.6 శాతం మంది పరీక్ష రాశారు. ప్రాథమిక 'కీ'పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే... ఈనెల 7వ తేదీ 5 గంటలలోపు వెబ్‌సైట్‌లో ఆధారాలతో నమోదు చేయాలని ఉపకులపతి హేమచంద్రారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ... అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్‌ఈసీ