ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - తెలుగు ప్రధాన వార్తలు

.

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Sep 23, 2020, 7:00 PM IST

  • తగ్గుతోంది
    రాష్ట్రంలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్​లో ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి బాధితుల సంఖ్య 6,46,530కి చేరిందని ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అక్టోబర్​ 2 నుంచి రెండో దశ
    'మనం-మన పరిశుభ్రత' రెండోదశ కార్యక్రమం అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలు రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కాల వ్యవధి పొడిగింపు
    పలు అనుమతులు, సర్టిఫికెట్ల కాల వ్యవధిని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కేరళ మంత్రికి కరోనా పాజిటివ్
    కరోనా వైరస్​ బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు వైరస్​ సోకగా.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రికార్డు బ్రేక్​
    ఉత్తరార్ధ గోళంలో నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతను ప్రపంచ వాతావరణ సంస్థ గుర్తించింది. 1991 డిసెంబర్ 22న క్లింక్ అనే ప్రాంతంలో -69.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ధ్రువీకరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మార్ష్ స్థానంలో హోల్డర్
    సన్​రైజర్స్ హైదరాబాద్​లోకి కొత్త ఆల్​రౌండర్ వచ్చాడు. గాయపడిన మిచెల్​ మార్ష్​కు బదులుగా వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ జేసన్ హోల్డర్​ను తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్​సీబీ సమన్లు
    సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు చేస్తున్న మాదక ద్రవ్యాన నియంత్రణ సంస్థ.. ప్రముఖ నటి దీపికా పదుకొణెకు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details