ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్ర యూనివర్సిటీలో 68మందికి కరోనా.. అప్రమత్తమైన యంత్రాంగం - corona on au news

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 68 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్​ వైద్యాదికారుల బృందంతో కలిసి వసతి గృహాలను సందర్శించారు. ఇప్పటివరకు బయటపడిన కేసుల్లో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని కలెక్టర్ చెప్పారు.

au corona
ఆంధ్ర యూనివర్సిటీ కరోనా కేసులు, ఆంధ్ర యూనివర్సిటీ కరోనా కలకలం వార్తలు

By

Published : Mar 27, 2021, 3:17 PM IST

విశాఖలోని ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో 68కిపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌డంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్ట‌ర్ విన‌య్ చంద్, ప్రాంతీయ కొవిడ్ నోడ‌ల్ అధికారి డాక్ట‌ర్ పి.వి. సుధాక‌ర్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ స‌హా అధికారుల బృందం యూనివర్సిటీ హాస్టళ్లను సంద‌ర్శించింది. విద్యార్థులంద‌రికీ కొవిడ్ ప‌రీక్ష‌ల‌ు నిర్వ‌హిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ విన‌య్ చంద్ చెప్పారు.

ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌ప‌డిన పాజిటివ్ కేసుల్లో ఎవరికీ తీవ్ర‌ ల‌క్ష‌ణాలు లేవ‌ని అన్నారు. విద్యార్థులకు అవ‌స‌ర‌మైన చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. వ‌స‌తి గృహాల్లో ఉండ‌డం వ‌ల్ల వేగంగా ఒకరి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందింద‌ని.. ఇంజ‌నీరింగ్ బాలుర వసతి గృహాల్లోనే హోం క్వారంటైన్ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌కు కూడా స‌మాచారం ఇచ్చామ‌ని.. ఎవరూ అందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని స్ప‌ష్టం చేశారు.

ఇదీ చదవండి:'కొవిడ్‌ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలి'

ABOUT THE AUTHOR

...view details