విశాఖలో భాజపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. భవిష్యత్తులో అన్ని పార్టీల నేతలు తెదేపాలో చేరతారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు వ్యతిరేక పవనాలు వీచినా.. విశాఖలో ఎక్కువ గెలిచామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని గంటా పేర్కొన్నారు.
భవిష్యత్లో అన్ని పార్టీల నేతలు తెదేపాలో చేరతారు:గంటా - గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెదేపాలో చేరిన భాజపా కార్యకర్తలు
విశాఖలో 300 మంది భాజపా కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. విశాఖలో లక్ష కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత తెదేపాదేనని గంటా గుర్తు చేశారు.
భవిష్యత్లో అన్ని పార్టీల నేతలు తెదేపా చేరతారు:గంటా
Last Updated : Feb 17, 2020, 11:37 PM IST