రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,709 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 210 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,180కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 140 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,981కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,44,48,650 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా కేసులు, ఒకరు మృతి - corona death toll in ap news
రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకునమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది.
![రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా కేసులు, ఒకరు మృతి ap corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10981145-11-10981145-1615552438515.jpg)
ap corona