ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో 20 పడకలు: కలెక్టర్ - visakha district Latest News

విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో పడకలు కేటాయించినట్టు కలెక్టర్ వి.వినయ్ చంద్ వెల్లడించారు. డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయించినట్టు వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్ కమిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్ నేతృత్వంలో కమిటీని నియమించినట్టు కలెక్టర్ వెల్లడించారు.

బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో 20 పడకలు
బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో 20 పడకలు

By

Published : May 19, 2021, 7:47 PM IST

విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ (మ్యూకార్ మైకోసిస్) పేషెంట్లకు చికిత్స కోసం కేజీహెచ్​లోని డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్లినికల్ మేనేజ్​మెంట్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.పి.వి.సుధాకర్ నేతృత్వంలో సీనియర్ వైద్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రతి కేసును కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఛాతీ, ఈఎన్​టీ, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు, న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజి, మైక్రోబయాలజీ విభాగాధిపతులు సభ్యులుగా ఉంటారని కలెక్టర్ వివరించారు. అప్రమత్తంగా వ్యవహరించి వైద్య వర్గాలతో నిరంతరం సంప్రదిస్తారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details