ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1 pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @1 pm
ప్రధాన వార్తలు @1 pm

By

Published : Aug 30, 2021, 1:00 PM IST

  • కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్​సీ లేఖ.. తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని విజ్ఞప్తి

తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని కోరుతూ... ఈఎన్​సీ నారయణరెడ్డి లేఖ రాశారు. ఏపీ ఇండెంట్ లేకుండా చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపాలని లేఖలో కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పోలీసు సిబ్బంది కొరత.. నేర నియంత్రణపై ప్రభావం

విజయవాడ నగర కమిషనరేట్‌లో పోలీసు సిబ్బంది కొరత ఏర్పడింది. పలు పోస్టులకు భర్తీ లేకపోవడంతో అరకొర సిబ్బందితో పనిభారం పెరిగింది. ఈప్రభావం నేర నియంత్రణపై పడుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Krishnashtami: ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫ్లై ఓవర్ వంతెనపై గుంతలు.. పూడ్చిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పై వంతెనపై గుంతలను స్థానిక పోలీసులు పూడ్చి వేశారు. వాహనదారులకు ప్రమాదం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నిద్రిస్తున్న బాలికపై యాసిడ్​ దాడి- ప్రేమే కారణమా?

ఇంటి ముందు నిద్రిస్తున్న బాలికపై యాసిడ్​ దాడికి(acid attack) పాల్పడ్డాడు దుండగుడు. బాధితురాలితో పాటు ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో జరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఊరిపై విరుచుకుపడ్డ కొండ- ముగ్గురు పిల్లలు మృతి

ఉత్తరాఖండ్​(Rains in uttarakhand) పిథోర్​గఢ్​ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ గ్రామంలో కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. నలుగురు గల్లంతయ్యారు. ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • North Korea: అణ్వాయుధాల ఫ్యాక్టరీని మళ్లీ తెరిచిన కిమ్!

అణ్వాయుధాల విషయంలో(Nuclear Weapons) అమెరికాతో బెదిరింపులకు దిగుతున్న ఉత్తరకొరియా(North Korea) మరో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది. యోంగ్​బ్యోన్​లోని న్యూక్లియర్​ రియాక్టర్​ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని ఐరాస అణువిభాగం తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Stock Markets Live: బుల్ జోరు- ఆల్​టైం హైకి సూచీలు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. మార్కెట్ల చరిత్రలోనే సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ 591 పాయింట్లు బలపడి జీవిత కాల గరిష్టం 56,716కి చేరింది. నిఫ్టీ కూడా 159 పాయింట్లు వృద్ధి చెంది ఆల్​టైం హై 16,864ను తాకింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Stuart Binny: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రిటైర్మెంట్

భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించాడు. తన కెరీర్ ఎదుగుదలలో తోడ్పాటు అందించిన బీసీసీఐ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్​ సహా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • New movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

గత నెల రోజులుగా థియేటర్లలో సినిమాలు సందడి చేస్తున్నాయి. చిన్న బడ్జెట్​ సినిమాలదే హవా. ఇదే ట్రెండ్​ సెప్టెంబరులో కూడా కొనసాగనుంది. మొదటి వారంలో విడుదల కానున్న ఆ సినిమాలు (New movies) ఏంటో తెలుసా?పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details