విశాఖ మన్యంలో దారాలమ్మ ఘాట్ రోడ్డులో జీపు అదుపుతప్పి (road accident at dharalamma ghat road in vishakapatnam) బోల్తాపడింది. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జి.మాడుగుల మండలం బౌడ గ్రామాంలోని ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. గూడెం కొత్తవీధి మండలం ధారకొండ దారాలమ్మ తల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో.. దారాలమ్మ ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద బ్రేకులు ఫెయిలై జీపు అదుపుతప్పి బోల్తాపడింది.