Enforcement 144 Section at AU: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్ద 2 బృందాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏయూ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చలో ఏయూకు పిలుపునిచ్చింది.
మరోవైపు.. చలో ఏయూ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఫలితంగా రెండు వర్గాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు.. ఏయూ, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.