ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ పూచీకత్తు.. చక్కెర కర్మాగారాలకు ఊరట - రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలు

చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి వంద కోట్ల రూపాయల రుణం అందింది. ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కారణంగా... ఇది సాధ్యమైంది.

రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రుణం మంజూరు

By

Published : Mar 30, 2019, 12:25 PM IST

రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రుణం మంజూరు
సహకార చక్కెర కర్మాగారాలకు ఆర్థిక ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో జాతీయ సహకార అభివృద్ధి సహకార సంస్థ (ఎన్సీడీసీ) 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఆ నగదును ఆయా చక్కెర కర్మాగారాల ఖాతాల్లో జమచేసింది.విశాఖ జిల్లా గోవాడకు 44 కోట్లు, ఏటికొప్పాకకు 23 కోట్లు, తాండవ చక్కెర కర్మాగారాలకు 21 కోట్లు జమయ్యాయి. విజయనగరం జిల్లా భీమ్ సింగ్ షుగర్స్​కు 12 కోట్లు జమ చేశారు. ఇప్పటివరకూ రైతులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయని చక్కెర కర్మాగారాలు.. రుణ మంజూరుతో బకాయిలచెల్లింపుల ప్రక్రియ ప్రారంభించాయి.


ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details