ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లారీ ఢీ కొని స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి.. స్థానికుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత - 1 person died in accident

విశాఖ జిల్లా పెద్ద గంట్యాడ - గంగవరం మార్గంలో లారీ ఢీ కొని.. ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పెంటయ్యగా గుర్తించారు. స్థానికుల ఆందోళనతో.. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

లారీ ఢీ కొని స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి
లారీ ఢీ కొని స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి

By

Published : Feb 8, 2021, 11:02 PM IST

విశాఖపట్నం జిల్లా పెద్ద గంట్యాడ - గంగవరం మార్గంలో లారీ ఢీ కొని పి.పెంటయ్య (42) అనేవ్యక్తి మృతి చెందాడు. మృతుడు పెంటయ్య... స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు. అతని మృతదేహాన్ని తీయకుండా గంగవరం మత్స్యకారులు ఆందోళకు దిగారు. ఆ మార్గంలో భారీ వాహనాలు వద్దంటూ పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. ఇద్దరు ఏసీపీలు రంగంలోకి దిగారు. ప్రత్యేక బలగాలను మోహరించారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఆందోళనకారులు మరింత ఆగ్రహించారు. ప్రమాదానికి కారణమైన లారీకి నిప్పు పెట్టారు. ఆ వాహనం మంటల్లో తగలబడింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో.. గంగవరం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పది వెలకుపైగా జనాభా ఉన్న ప్రాంతానికి రెండు గంటలుగా విద్యుత్ నిలిపివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details